పుట:హంసవింశతి.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతి శ్రీరామచంద్రున కంకితము చేయుట.

షష్ఠ్యంతకందములు

క.

వారణ భయవారణ జయ
కారణ చక్రాహతారి కరవారునకున్.
నీరాకర ధారాధర
భారాజీ భాసురప్రభాపూరునకున్!

17


క.

భీషణ ఖరదూషణ పరి
శోషణ సురపోషణోగ్ర శోభనమతికిన్
శేషాహిప భాషాధిప
యోషాహిపరాశ్వకీర్తి యోగోన్నతికిన్!

18


క.

సింధుసుపుత్రీకుచధర
కంధరశుభవిగ్రహునకుఁ గమలజసురరా
ట్సింధురముఖ సింధురముఖ
బంధుర జాతస్తవార్హపదనివహునకున్!

19


క.

తక్షక కులశిక్షక చల
పక్షకళాత్యరుణహేమపటసంభృతికిన్
దక్షాధ్వరశిక్షాకర
రక్షాచరణప్రవీణ రాజద్గతికిన్!

20


క.

వక్రత్రయచక్రకుచా
వక్రతనూరూప వైభవదచారునకున్
జక్రాహిత శక్రాహిత
చక్ర మహాపక్రమోపసంహారునకున్!

21


క.

భామాయుత కామాయిత
కోమలసుందరశరీరగురుధామునకున్
భీమరిపుస్తోమ వపు
స్స్థేమతమస్సోమునకును శ్రీరామునకున్!

22