పుట:హంసవింశతి.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lix

ఒకనాఁడు కోడలు లేదుగదా యని అత్త ఒక జెట్టితోఁ బెనఁగుచుండెను. అత్త లేదుగదా యని కోడలు అపుడొక విటునిఁదెచ్చికొనెను. అత్తకోడండ్రు ఒకరిమొగ మొకరు చూచుకొనిరి. గడిదేఱినది గదా అత్త "వీఁడెవఁడే? సంజకడ, ఇంటికిఁదెచ్చినావు" అని యడిగెను. కోడలు మెత్తగా బదులిచ్చెను. “అత్తా! యీ మహానుభావుడు ఆలుమగలకు అనురక్తి ఘటించువాఁడు, నేను చిన్నదానను. అనుభవము లేనిదానను, ఇతనినడిగి ఆ తంతు నీవే నడిపింపుము". అత్త అందుకొన్నది. “నేనును అదే ఆలోచించి వైద్యుని బిల్చుకొనివచ్చినాను. పని చేసినాఁడు ఈతనితోఁ గాకున్నచోఁ జూడవచ్చు. ఆతనిఁ బంపించు"మనెను. విటులిద్దఱు వెడలిపోయిరి. అత్త అనుమానించలేదు. కోడలు అనుమానించలేదు. ఎవరిగుట్టు వారిది.

పందొమ్మిదవ రాత్రి కథ

గాండ్లసెట్టిభార్య మణిచిత్రిణి. మేకపోతును బట్టికొనిపోవు బ్రాహ్మణకుమారుని బట్టికొని భోగించుచుండఁగా మగఁడువచ్చెను. మేక పోతును విడిచి “పట్టుకో పోనీకు" అని అఱచుచు వచ్చి, వాకిలి దీసెను, మగఁడువచ్చి, మేషమును బట్టియిచ్చి బ్రాహ్మణునిఁ బంపెను.

ఇరువదవ రాత్రి కథ

మంత్రికొడుకు పెండ్లి వద్దని కూర్చుండెను. ఏమిరా? అనిన, స్త్రీలను నమ్మరాదనెను. చుట్టపక్కాలు పెద్దలంతా వానికి నచ్చఁజెప్పి, ఒకేసారి యిద్దఱిని ముడివేసిరి, వాఁడు భార్యల నిద్దఱిని వేర్వేఱు గదులలో నాకసమంటు నొంటికంబపు మేడలో నిలిపెను. వారికి సతతమైథునచింత. పెద్దామె సువర్ణ. చిన్నామె సుప్రభ.

ఒకనాఁడు సువర్ణముంగిట రెండు పాదుకలు పడెను. వానివెంట నొక బాపఁడు దిగెను. సువర్ణ అతని కాతిథ్యమిచ్చి, పాదుకాసాహాయ్యమున ఉపవనికి దోడ్కొనిపోయి సుఖమిచ్చి పంపెను.