పుట:హంసవింశతి.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lviii


వీఁడు మనయింట దూఱెను. నేను వాకిలి వేసితిని. వాడు దూఁకి వచ్చి, సెట్టిని బట్టుకొనఁబోయెను. నేనడ్డపడి, రెడ్డి లేఁడు. నీవు రావద్దు, పొమ్మంటిని. ఇంతలో నీవు వచ్చితివి. వాఁడు నామీఁదఁబడి యేడ్చి పోవుచున్నాఁడు." అని చెప్పి సెట్టిని బయటికి రమ్మనెను. రెడ్డి సెట్టికి అభయమిచ్చి, తన యౌదార్యము ప్రకటించి, పొమ్మనెను.

పదునాఱవ రాత్రి కథ.

హిరణ్యకుఁ డనువాఁడు తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చుచు, నొకనాఁడు వానకుఁ దడిసి, బెస్తవాని పంచఁ జేరెను. ఆ యింటి మచ్చెకంటి వానిని వలలో వేసికొనెను. ఇద్దరు కలిసియుండఁగా ఇంటివాఁడు వచ్చి, "ఎవరది?" యనెను. ఆ యిల్లాలు ముసుఁగులోనుండి పండుకొనియే మాఱుగొంతు వెట్టి “మేము యాత్రికులము. తలదాఁచుకొన్నాము. తెల్లవాఱఁగనే వెళ్ళిపోదు" మనెను. అతఁడు మంచిదని లోపలికిఁ బోయెను. ఈమె లేచి, నీళ్ళకుండ యెత్తుకొని, మగని వెనుకనే యింటి లోనికిఁబోయి, “ఏడుంటి వీసరి ప్రొద్దుదనుక?"అని గద్దించెను .

పదునేడవ రాత్రి కథ

రూపసేన యను కుమ్మరి బిత్తరి సారణుఁడను సాలెవానిఁ గూడియుండఁగా మగఁడు తలుపు దట్టెను.

ఆమె దున్నపోతు తలుగువిప్పి హడావిడి చేసి తలుపు దీసి, తలుపు వేయుమని మగనిఁ దొందరించెను. దున్నపోతు విడిపించుకొని చెలరేఁగినది. ఈ తెరువరి సాయము వచ్చినాఁడని చెప్పెను. అతఁడు నమ్మెను .

పదునెనిమిదవ రాత్రి కథ

విహారి బలిజెసెట్టి భార్య. చెడి యొక కొడుకును గనెను, వాఁడు పెద్దవాఁడై బోగముదాని పంచఁబడెను, వాని గృహిణి, విధి లేక, జారిణి యయ్యెసు, వానితల్లి పూర్వసాంగత్యమును విడువదయ్యెను. ఇంట ఆత్త కోడలు చెఱి యొక దారి యైరి.