పుట:హంసవింశతి.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lvi


పదునొకండవ రాత్రి కథ.

చండరశ్మి కిద్దఱు భార్యలు. చీటికి మాటికిఁ గొట్లాడుచుండిరి. ఆ బ్రాహ్మణుఁడు పెద్దభార్యను బయటికిఁ ద్రోసెను. ఆమె కడగానుండెను. ఉండి తట్టుకొనలేక, ఒకనాఁడొక ఆకతాయి భిక్షువురాఁగా, వానితో సంబంధము పెట్టుకొనెను. వాఁడు పగలు ఊరిలో అడిగికొనితిని, రేయి బ్రాహ్మణియొద్ద నిదురించుచుండెను. ఒకనాఁటి రేయి, చిన్న భార్యతో జగడమాడి, భర్త పెద్దభార్య యింటికి వచ్చెను. అపుడామె జారుని రెట్టబట్టుకొని తలుపుమూల నిలిపి తలుపు తెఱచి, భర్త పాదములకు మ్రొక్కి లోపలికిఁ బిల్చుకొని శయ్యఁజేర్చి, తలుపువంకఁ జూచి, “నేఁ డెయ్యెడకై న నేఁగవె చెలీ!" యనెను. ఆ సంకేతము గ్రహించి విటుఁడు వెడలి పోయెను. ఎవతెయో ఆఁడుతోడు కాఁబోలు ననుకొనునట్లు చేసెను.

పండ్రెండవ రాత్రి కథ.

శివదత్తుఁడు భక్తుఁడు, సాధకుఁడు. అతని భార్య విశాల, విశాలలోచన. ఆమె నతఁడు చెంతఁ జేరనీయఁడు. చేరెనా? "చీ! ఱంకులాఁడి! చను" మనెడువాఁడు. ఆమె చూచి, చూచి, తెగించి, ఒకని నింటికిఁ దెచ్చికొని రమించుచుండెను. పతి వచ్చి చూచి మండిపడెను. అపుడామె యేమన్నది ? “అయో! మగఁడా! నీవే నా కొంప దీసితివి. “ఱంకులాఁడి, ఱంకులాఁడి" యంటివి. నీ వాక్కు తాఁకి నే నిట్లైతిని. యోగులపలుకు రిత్తపోదు. పతివ్రతవు గమ్మని పలుమాఱు పల్కుము. లేకున్న నేను ఆత్మహత్యకుఁ బాల్పడుదును" అన్నది. శివదత్తుఁడు తన వాక్కునకు అంతటి ప్రభావ మబ్బినదని మిక్కిలి సంతోషించెను; ఆశీర్వదించెను.

పదుమూడవ రాత్రి కథ.

శఠుఁడను ద్విజుని సతి సుఖమతి. ఆమె నడవడిక సరిగా లేదని అతని కనుమానము గలిగెను. కావలసి యొకనాఁడు దూరదేశ మేఁగుచున్నానని చెప్పి వేకువజామున బయలుదేరెను. సుఖమతి ఊరి వెలుపలిదనుక సాగనంపి, బహి