పుట:హంసవింశతి.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

ఒంటిమిట్ట కవుల దొక ప్రత్యేకపు బాణీ, రఘువీర శతకము చెప్పిన తిప్పయ్య మొదలుకొని వీరందఱు సీతా రామస్తుతితోనే కృతికి శ్రీకారము చుట్టుదురు. కవి స్తుతిలో శ్రీనాథుని పేరెత్తరు పోతన్నకు విశిష్ట స్థానమిత్తురు రామభద్రకవి చూడుఁడు.

“గీ. శబ్దశాసన సుకవి కంజలి యొనర్చి
    యుభయకవి మిత్రునకు హస్తయుగళి మోడ్చి
    శంభుదాసుని సోము భాస్కరుఁ దలంచి
    యాంధ్ర వాగ్భాగవత కర్త నభినుతించి.”
                                      (రామాభ్యుదయము. 1-10)

తుదిపాదమంతయుఁ బోతనకే. వీరి రామభక్తి యట్టిది, కాదు. ఆ స్థలమహిమయే అట్టిది. నారాయణకవి పాటించిన వాణిని బట్టి అతఁ డక్కడి వాఁ డనియే చెప్పవలెను.

ఇంత యేల! ఇందలి మాండలిక శబ్ద స్వరూపము మాటతీరు “ఇతఁడు పలానా ప్రాంతమువాఁడు" అని చెప్పక చెప్పుచున్నవి.

కాలము

నారాయణకవి జీవించిన కాలము గుఱించి, పెద్దలు తలకొక రకముగా నూహించి చెప్పిరి. నికరముగాఁ దేల్చి చెప్పినవారు లేరు. కదిరీపతి కంటె అర్వాచీనుఁ డనిమాత్రము అందఱును గంఠోక్తిగాఁ జెప్పిరి. కదిరీపతి కవి క్రీ.శ. 1660 ప్రాంతమున నుండెనని డా॥ నేలటూరి వేంకటరమణయ్యగారు వ్రాసిరి. శ్రీ ఆరుద్రగారు క్రీ.శ. 1648 ప్రాంతాలకే కదిరీపతికి కావ్యనైపుణ్యాదులు పట్టుబడ్డాయన్నారు. “నారాయణ కాలం క్రీ.శ. 1650 అవుతుంది" అన్నారు. ఎవరు ముందో యెవరు వెనుకో అను సందేహము మనకుఁ గలుగును. కాని, కదిరీపతి కావ్యఫక్కి నారాయణకవి “మక్కికిమక్కి అనుకరణ చేశాడు” అన్న పంక్తితో ఆ సందేహము తొలఁగును. సమకాలికులైనచో ఈ వ్యవహారము కోర్టు