పుట:హంసవింశతి.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxii

దూరదేశమేఁగు విష్ణుదాసుఁడు తనవెంటఁ గావళ్లలోఁ గొంపోయిన తిండ్లు చిఱుతిండ్లు అలనాఁటి తెలుఁగువారి భోక్తృత్వమును, గవి విశేషజ్ఞత్వమును బ్రకటించును.

బోగమువారి యింటిని జూపెట్టుకొనియుండు అనుజీవు లెందఱుందురో, వారి నందఱిని సంతుష్టులఁజేయవలసిన కష్టము విటుల కెంత యున్నదో చక్కగా వ్రాసెను. ఒక విటుఁడు-

సీ. పంచాంగమయ్యకు బాగ సమర్పించు
           నట్టువకానికిఁ బెట్టు మురువు
    భరతంపు టొజ్జకుఁ బచ్చడం బొగిఁగప్పుఁ
           బొగడు బట్టుకుఁ జేర్చుఁ బోఁగుజోడు
    కథ చెప్పు భూసురాగ్రణికి దోవతొసంగు
           ననువుకానికి బత్తె మెనయ నడుపుఁ
    బూల్గట్టు సాతానిబోటి కుంగర మిచ్చు
           గందొడివానికి విందు సేయుఁ

తే. జతురికకుఁ జీర దూతికి సందిబొందె
    కడెము పరిచారికకు సారికకును రవిక
    తాపికకు సొమ్ము వేశ్యమాతకును గాన్క
    లిచ్చి చెప్పించు రతిసేన కెచ్చుతమిని. (5-134)

వీరుగాక గుండఁడు అడిబండఁడను రౌడీలున్నారు. లండి, గుమ్మెతకాఁడు, భృత్యుఁడు, ఆఁడంగివాఁడు తరువాతి పద్యమునఁ జెప్పఁబడిరి. ఇంత బలగముతో వేశ్యానిలయము కలకల లాడుచుండునఁట.

ఎద్దు, గుఱ్ఱము, తమపాట్లు దున్నపోతుతోఁ జెప్పికొనును.

సీ. తలయేరు బెట్టి బీడులు దున్ని పడఁగొట్టి .
           కాలు చిక్కిన బండ్లఁగట్టి మొత్తి