పుట:హంసవింశతి.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxvi


మేడలైనఁ గట్టుదురు. పద్యగత ప్రాసస్థాన మొక క్రీడా స్థానము. వెయ్యి యొయ్యారములు చూపింతురు. కందములు, సీసములు, ఆఁటవెలఁదులు చేయి దిరిగిన కవిచేతిలో ఎన్ని సొంపులు వోవునో చెప్పలేము. ఇవిగాక, పద్యము పద్య మంతయు నేక సమాస ఘటితముగా నిర్మించుట, అచ్చ తెలుఁగులు గుది గ్రుచ్చుట, సర్వగురు, సర్వలఘు, ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, నిరోష్ఠ్య పద్యములు రచించుట, శ్లేష, బంధ, గర్భ, అనులోమ, విలోమ, పాదభ్రమక ప్రముఖ చిత్ర పద్యములు సాధించుట కొద్దిగనో గొప్పగనో చేసి తీరవలయుట యొక మర్యాద యయ్యెను. హంసవింశతి యందు ఆ మర్యాదకు లోటు లేదు.

నారాయణకవి రామరాజ భూషణకవి వలె శ్లేషోక్తి వైచిత్ర్యముఁ జూప యత్నించినాఁడు. కాని యితని కా త్రోవ సుగమము కాలేదు. కారణము తెల్లమే. రామరాజ భూషణుఁడు పిండికలవాఁడు. అతని చేతిలో సంస్కృత వాణి తడిపిన గోదుమ పిండివలె సాఁగును. ఇతనికిఁ జేమకూర వేంకటకవి త్రోవ చక్కగాఁ బట్టువడినది. ఆ ముద్ర యితని కృతిలో సర్వత్ర బారసాఁచి నగుమొగముతోఁ బొడకట్టును. చతుర్థాశ్వాసము 74వ పద్యము, పంచమాశ్వాసము 277వ పద్యము చూడఁగలరు.

కందముల చిందులు

తొడలందము కటిచందము
నడుగుందమ్ముల బెడంగు లాస్యము రంగుల్
జడతళుకున్ మెడకులుకున్
నడబెళుకుం జూడ నా ఘనస్తని కమరున్ . (2-17)

విరులా? నగవులు, నీలపు
సరులా? కురు, లుబ్బు గబ్బి చన్నులు జాళ్వా
గిరులా? యూరు లనంటుల
సిరులా? యని జనులు మెచ్చఁ జెలువ చెలంగున్ . (4-71)