పుట:హంసవింశతి.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278 హంస వింశతి

ఊరు చరణ కక్షపాద వేష్టితక హళికకరణ నాగపాశాంగ చక్ర గుహ్యక ద్విరదావలంబన చిత్రలాఘవ మదనకుంచిత గగనకరణోర్ద్వ బాహూత్ఫుల్లక మర్కట విమర్దన వేణుకోద్వేగ పరావృత్త గణాంగ దృఢాంగ సింహావలోకన పాదారోహణ ప్రియాంగ బాడబబాణ కృత్తమదన రాజహస్త లాఘవ బాహుచరణ చక్రపాద మదన సంఘట్టన పాదమేళన గోముఖాంగ సంవేద్యకరణ సమితాంగ కరణంబులను చౌశీతిబంధంబులను జమత్కారంబులఁ బెనంగుచుండి రయ్యవసరంబున. 151

మర్లు మందు

సీ. గంబూరమును జాజికాయ లుమ్మెత్త వి
త్తులు మర్లు మాతంగి కలువగడ్డ
పచ్చయెన్నులు కోష్టు పచ్చిక మంచేసుఁ
గుమదము గుళ్ళసున్నమును రుద్ర
జడవేరు వస ఖురాసాని వామము పుడు
కల పోలుగాఁడు మైఁగారు చెమట
నీరావు గజ్జల చేరిన మష్టును
గాల్మడి ఱాతంటుగాను నూరి
తే. కలయ గురిగింజలంతేసి గుళిక లమరఁ
జేసి నీడనె యాఱించి తీసి దాచి
యున్న మంచింత మడుపుతో నొసఁగె నతని
కధికతరమోహ మూన నా హంసయాన. 152

క. ఈ బాళిమందు మసగొని
యాబిడ తనకండ్లు గట్టినట్లుండ నతం
డేబుద్ధి లేక యచ్చెలి
సోబెల కెదఁ జిక్కిచిక్కి చొక్కుచుఁ దిరుగున్. 153