పుట:హంసవింశతి.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 277

గవఁ దిర్యగంబును గక్షదేశంబులం
బ్రథితంబు చనుదోయి నధరకంబు
చిత్తము గృహమున నుత్తరస్ఫుటితంబు
పొక్కిట సంపుటంబును శిరోధి
ననుపదం బూరుల నన్వితం బన నొప్పు
దళచుంబనములుఁ దత్తత్స్థలములఁ
తే. బొదలు ముదముసఁ బర్యాయమున ఘటించి
కలయ శశకవ్రత మయూర ఫలక రంజి
సుచ్చురిక మండలిక గండ సుత్రిభాగ
ముఖ ముఖ నఖక్షతంబులు మొనయఁజేసి. 148

తే. క్షతరదోచ్ఛూన ఖండాభ్రక ప్రవాళ
మణిక గూఢక రుచిబిందు మణికబిందు
మాలికా కోల చర్వితాఖ్యాళి వెలయు
పదిరదక్షతముల వేడ్కఁ గదియ నొక్కి. 149

క. స్థితమును దిర్యగ ముత్తా
నితమును నాభిస్థితమన నిపుణజనులు ప్ర
స్తుతిగొనఁ దనరు చతుర్విధ
రతుల గతుల నతుల మబ్బురము గావించెన్. 150

వ. వెండియు నఖండసురతపాండిత్యంబున విటుండును నయ్యండజయానయు, మదవేదండంబులరీతి జృంథక కూర్మక రణస్కంధయుగ గర్భపీడిత సాధుక దృఢలావుక కర్కట సముద్గక వేణుదారిత సంయమ కృత కోపరతి ధృతోరుక నాగరక ప్రేమాభిరామ చక్రభ్రమణ ప్రసాదిత శూలాంచిత పాదవేక్షిత బాణరంజన మదనరంజన పార్శ్వఘట్టన భావికోల్బణ మండూకకరణ గ్రామ్యకరణ సర్వతోభద్ర మండలప్రభ మధురకంపితాంగసంపుటార్ధసంపుట పద్మక అర్ధపద్మక అంబురుహ భారచరణ పాదపదక పాదబంధపాదాశ్లేషణమదనడోలన చంద్రార్ధ మండలార్ధ