పుట:హంసవింశతి.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

241 చతుర్థాశ్వాసము

శా. ఈ లీలన్ వెస బొంక నేర్చిన నృపత్యేకాగ్రచూడామణీ
కేళీసంభ్రమచిత్తవృతి సురతక్రీడాచమత్కారచ
ర్యాలాలిత్యకథాప్రయత్నమున కత్యాసక్తి తోఁ బొమ్ము లే
దా, లోలాంబక! యూరకుండు మని కాదంబేంద్రుఁ డిట్లాడఁగన్. 238

చ. తెలతెలవాఱ వచ్చుట సతీమణి యప్పుడు చూచి కేళికా
నిలయముఁ జేరనేగి ధరణీధవుపైఁ దమి మీఱ నుండె నా
చెలి యనుచుం బురోహితుఁడు సెప్పిన నాత్మ జనించు వేడ్క
నా నల నరపాలమౌళి తదనంతరగాథ వచింపుమా! యనన్. 239

[1]శా. రక్ష శ్శిక్షక రక్ష యక్షయ నృపాధ్యక్షా సదాక్షేమ కృ
ద్వక్షా రక్షిత శుభ్రపక్ష హయదార్ధక్ష్మాఖ్య మద్రారి స
రక్షా యన్యనిలాక్షరాక్షస జలాధ్యక్షాగ్ని వాయుః క్షపా
తృక్షేక్షార్భక పద్మరక్షక రమాధ్యక్షారవిందేక్షణా. 240

పాదభ్రమకకందము.
రామానుత తను మారా
ధీ మదవనధీ వర రవ ధీ నను దమ ధీ
తామస జయ యజ సమతా
నామగతాఘ నయతత యనఘతా గమనా. 241

[2]మణిగణనికరవృత్తము.
హరిహయ పరిణాభ్యదయవ భరణా
హరిహయ హరిణాభ్యదమ విభరణా

  1. ఈ పద్యము వ్రాయసగాండ్ర చేతులలోఁ బడి చెడి యిట్లున్నది.
  2. ఈ పద్యపు పూర్వార్ధమున ఛందోభంగము