పుట:హంసవింశతి.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xviii


 చతుష్పదాం సృగాలస్తు
 స్త్రీణాం ధూర్తాచ మాలినీ.

హేమవతి రాజసంగతిఁ గోరి మగఁడులేని తఱిఁ బయనము కట్టినది. అత్తమామల శాసనము బంధుమిత్రుల భయము లెక్క చేయలేదు. కవిత్వము నేర్చిన హంస ఆడ్డగాలు వేయఁగాఁ గాలు కదలింపలేక నిల్చినది. ప్రొద్దు గ్రుంకినంతనే ముస్తాబై పొంగులువాఱు కోర్కులతో గజ్జెల గుఱ్ఱమువలెఁ గడప దాఁటిపో నుంకించు హేమవతిని నిలుపుటకుఁ గవిహంస యుపయోగించిన సామగ్రి, తాను సైకతశ్రోణియగు వాణి నడిగి తెచ్చికొన్న “సుమధు మధుర సుధా వచస్స్ఫూర్తి "యే కాని, అన్యము కాదు. ఆ సామగ్రితో నొకయిల్లు నిలఁబెట్టి పుణ్యము గట్టికానెను.

కావ్యోపసంహారము

చూరదేశమేఁగినమగఁడు తిరిగివచ్చుచున్నాఁడన్నవార్త వచ్చెను. హేమావతి మనసున కంటిన మబ్బు విచ్చెను. "తే. కథలు రేల్ తెల్పుటయే కాదు కరుణఁబ్రొద్దుపోని యపుడెల్ల రాయంచ పూనిచెప్పినట్టి నయవాక్యములచేతనైన సన్మనీష" ఆమెయందు మొగ్గదొడగి పరిమళించినది. ఆమె “పరపురుషసంగమం బిహపర సుఖదూరంబుగానఁ బాతివ్రత్యస్ఫురణగల సతులు మదిఁగోర రటంచును నిశ్చయించు" కొనుట తత్సంస్కార ఫలము.

“పతికి నెదురుగనేఁగె నప్పద్మగంధి". పతిముఖసందర్శనముచే హేమవతి యందు అప్రయత్మముగ నొక శృంగారతరంగము పొంగినది. పొంచియున్న మాలిని గుర్తించెను. హేమవతి నిజముగా భర్త్రనురక్తయయ్యెను. 'పద్మగంధి' సాభిప్రాయవిశేషణము. ఈ క్షణస్ఫురణము, ఓష్ఠాగ్రస్ఫురణము, శ్రోణితటస్పురణము (5-370) కననయ్యెను. దూతిక దుసికిలిపోయి బుట్టలోఁబడిన పిట్ట తప్పించుకొన్నదని రాజుకుఁజెప్పినది. రాజు “కంపిత శిరస్కుండై కొంత తడవు చింతించి," బుద్ధి తెచ్చికొనెను. కొంతతడపు తానెంత ఘోరముగఁ జింతించెనో! “ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులఁగోరి, యేమిసౌఖ్యోన్నతిఁ జెందిరి?" అని ప్రశ్నించుకొన్నాఁడు. రావణుఁడు సీతనెత్తికొనిపోయినట్లు