పుట:హంసవింశతి.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఘృతంబును గూశ్మాండఘృతంబును మొదలయిన ఘృతంబులు సేయు నేర్పునుఁ బంచాగ్నిచూర్ణంబును జిత్రకాదిచూర్ణంబును బడబానలచూర్ణంబును మాణిమండచూర్ణంబుసు మరీచ్యాదిచూర్ణంబును దాళిసచూర్ణంబును నేలాదిచూర్ణంబును దుంబురుచూర్ణంబును గర్పూరాదిచూర్ణంబును బంచబాణచూర్ణంబును భుగ్వాదిచూర్ణంబును నాదియైన చూర్ణంబు లొనరించుచు నుపమయుఁ జించిల్యాదిలేహ్యంబును క్షుద్రాభయాదిలేహ్యంబును జతుష్షష్టిమరీచ్యాదిలేహ్యంబును గుసుమార్దాదిలేహ్యంబును చిప్పల్యాదిలేహ్యంబును బిల్వాదిలేహ్యంబును గుండల్యాదిలేహ్యంబును మొదలుగా గల లేహ్యంబు లొనరించు నైపుణ్యంబును నారికేళాదిరసాయనంబును గుడనాగరాదిరసాయనంబును శిగ్రుపుష్పరసాయనంబును జూతఫలరసాయనంబును సుకుమారరసాయనంబును భల్లాతకీరసాయనంబును సుదర్శనరసాయనంబును వారాహీరసాయనంబును విళంగాదిరసాయనంబును నమృతరసాయనంబును నాదిగాఁగల రసాయనంబులు సేయు పొందిక లెఱుంగువిధంబును శరపుంఖాదితైలంబును లక్ష్మీనారాయణతైలంబును లావాడతైలంబును ధన్వంతరితైలంబును బంచార్కతైలంబును బాశ్చాత్యనింబతైలంబును విషముష్టితైలంబును కేతకీతైలంబును స్నేహార్కతైలంబును వాతాంతకతైలంబును బూతికాతైలంబును భూనాగతైలంబును భృంగామలకతైలంబును మొదలగు తైలంబుల పరిజ్ఞానంబును నారికేళాంజనంబును సౌవీరాంజనంబును వీరభద్రాంజనంబును నీలాంజనంబును గరుడాంజనంబును గపోతాంజనంబును గర్పూరాంజనంబును మొదలుగాగల యంజనభేదంబులఁ గూర్చు చమత్కారంబును నగ్నికుమారకము రాజమృగాంకము పూర్ణచంద్రోదయము వసంతకుసుమాకరము వాతరాక్షసము చంద్రహాసము చంద్రప్రభావతిరసము కందర్పాంకురరసము షణ్ముఖరసము కాలాగ్నిరుద్రరసము తాళకేశ్వరరసము ప్రతాపలంకేశ్వరము చాతుర్థికరామబాణము విష్ణుచక్రరసము విశ్వంభరరసము బడబానలరసము నారాయణరసము మదనభైరవరసము భార్గవరసము జ్వరాంకుశము స్వచ్ఛందభైరవము సంజీవనరసము రసభూపతిచింతామణి మొదలైన దివ్యరసౌషధంబుల