పుట:హంసవింశతి.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బును శూర్పకారకర్మంబును జోళ్ళు నిర్మించుటయుఁ బటకారకర్మంబును నదృశ్యకరణంబును దౌత్యకర్మంబును వేఁటసన్నాహంబును బేరంబును బాశుపాల్యంబును గృషియు మైరేయంబుఁ గూర్చుటయు లావుక కుక్కుట మేషాదుల పోరు హత్తించుటయు ననియెడు చౌషష్టివిద్యలమర్మంబు లెఱింగి యొప్పుచుండు. 155

క. ఈ రీతి సకలవిద్యల
నారూఢిగ నారితేఱి యవ్వటుఁడు సదా
చారస్థితి గంగాయా
త్రారంభవిజృంభమాణహర్షోదయుఁడై. 156

సీ. సకలాతు కుళ్ళాయి యొకయింత కాన్పింపఁ
జుట్టియుండిన పంచె సొంపు దనరఁ
బడెఁడు బియ్యము వండఁ బాటైన తపెల యుం
చిన చిన్నియసిమి దోస్సీమ వెలయ
ముంజిపైఁ గనుపట్ట ముద్దుగాఁ గట్టిన
యంగవస్త్రపుగుడ్డ చెంగులలర
మాంజిష్టి గలిపిన మంత్రాక్షతంబులు
పోసిన మారేడుబుఱ్ఱ యమర
తే. ధౌతశాటియుఁ బరిపాటి ధావళియును
వఱల వేదాంతశాస్త్రంబు వ్రాసినట్టి
తాళదళపుస్తకము చంకఁదనరఁ బూని
చనియె గడిదేఱి యా బ్రహ్మచారి మీఱి. 157

క. ఈ లీల సకలపురములు
శైలంబులు నదులు నిధులు శాఖిచయంబుల్
గాలువలుఁ బల్లె పట్టము
లాలోకింపుచును బోయి యవ్వటు వెదుటన్. 158