పుట:హంసవింశతి.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణ కుమారుని

చదువు సంధ్యలు — తీర్థయాత్ర

వ. అంత గర్భాదాన పుంసవన సీమంత జాతకర్మ నామకర ణాన్నప్రాశన చౌలోపనయన వివాహ ప్రాజాపత్య సౌమ్యాగ్నేయ వైశ్వదేవ గోదాన స్నాతక పితమేధంబులను షోడశకర్మంబు లెఱుంగంజేసి. 153

తే. వాని తలిదండ్రు లత్యంతవత్సలతను
బూఁటపూఁటకు గోముచేఁ బొసఁగఁ బెంచి
ప్రాభవం బొప్ప నసమానవైభవమున
ఘనత షోడశకర్మాధికారుఁ జేయ. 154

వ. అంత నత్యంతకుశలస్వాంతంబున నవ్వటుశిఖామమి వేదవేదాంగాది బ్రహ్మవిద్యాభ్యాసానంతరంబు గానంబును గవిత్వంబును గొక్కోకంబును జూదంబును దేశభాషల విజ్ఞానంబును లిపిలేఖనంబును జరాచరాన్యధాకరణంబును విలువిద్యయును సర్వజ్ఞానపరిజ్ఞానంబును శాకునంబును సాముద్రికంబును రత్నపరీక్షయు నరదంబుఁ బఱపుటయుఁ దురగారోహణంబును గజారోహణంబును మల్లశాస్త్రంబును బాకచమత్కారంబును దోహదప్రకారంబును ధాతుగంధరసఖనిజవాదంబులును గుట్టుపనుల వినోదంబు మహేంద్రజాలంబును జలాగ్నిఖడ్గస్తంభనంబును మొనకట్టును వాకట్టును రయస్తంభనంబును వశ్యాకర్షణమోహనంబులును విద్వేషణోచ్ఛాటనసంహరణంబులును గాలవంచనంబులును బక్షిగతిభేదంబులును యోగవాదంబులును వచనసిద్ధులును ఘుటికాసిద్ధులును బరకాయప్రవేశంబును నింద్రజాలంబును నంజనభేదంబులును ధ్వనివిశేషజ్ఞానంబులును దృష్టివంచనంబులును స్వరవంచనంబును మణిమంత్రక్రియలును జోరత్వంబును జిత్తరువు వ్రాయుటయు లోహకారకత్వంబును శిలాభేదకర్మంబును గులాలకర్మంబు రథకారకర్మం