పుట:హంసవింశతి.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీఱఁగరాదు, పైకొని రమింపఁగరాదు, గళారవంబు లిం
పారఁగ సల్పరాదు మదిరాక్షులు భర్తలఁ గూడు వేళలన్.94

వ. అదియునుం గాక. 95

క. పదివేల మదను లొక్కట
నుదయించిన లీల మెఱయు నురుగుణుఁడు సుమీ!
మదిరాక్షి! చిత్రభోగుఁడు
మదిఁ గోరెను నీదు భాగ్య మహి మెట్టిదియో!96

సీ. కువలయానందంబుఁ గూర్చి యేలు ఘనుండు
విబుధులఁ బ్రోచు సద్వితరణుండు
సర్వజ్ఞమౌళి భూషణమైన ధన్యుండు
లలితవిభ్రమరూపలక్షణుండు
సరవికళల్ నించు శ్యామాభిరాముండు
వఱలెడు సన్మార్గవర్తనుండు
విష్ణుపదార్చితవిహితశుభ్రకరుండు
వితతతమోహారి వినుతశీలుఁ
తే. డమ్మహారాజచంద్రుఁ డాయన నిజాంత
రంగమంతయు నినుఁజేర్చి రమణతోడ
నేలఁ గలఁ డమ్మ! నీ పుణ్య మెసఁగె నమ్మ!
తమిని నీడేర్పవమ్మ! కుందనపుబొమ్మ! 97

వ. అనిన విని సంభ్రమభయవిస్మయలజ్జాహాసకాంక్షలు మనంబునం బెనంగొన నమ్రముఖియై హేమావతి రాజదూతి కిట్లనియె. 98

ఉ. అమ్మకు చెల్ల! యిట్టి పలుకాడుదురే? మఱి యత్తమామలున్
గ్రమ్మి తలారులై మెలఁగఁగా మగఁడున్ బులిరీతిఁ దెంపుగా