ఈ పుట ఆమోదించబడ్డది
56
సౌగంధిక ప్రసవాపహరణము
కెరలి దర్వులు బాడుకిన్నరసఖులు ∗
లాలితస్వరకాలలయతాళగతుల
తాలమానంబులు దప్పకయుండ
కుటిలకుంతలములు కులికినటింప
నటియించు దేవతానలినలోచనలు
బొలుపుమీరిన మల్లెపూఁబొదరిండ్ల
వలరోజుకేళిలో వలపులు హెచ్చి
ప్రమదంబులను బహుబంధవైఖరుల 1
రమణులతో సమ రతులభోగించి
యంతంత మోహంబు లగ్గలం బైన
కాంతులఁ బైకొని కళ లుప్పతిల్లఁ
బలుమరు ధమ్మిల్ల బంధము ల్వీడ
బలువిడి కబరికాప్రసవముల్ రాల
సొలపుమై జెమటలు సోనలై గురియఁ
జెలువంపుహారముల్ చిక్కులుపడఁగ
నలుపురంజిల్లు కంకణము లందియలు
∗బల్కు (త) (ట)
1మార్గముల (శ)