పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

54

సౌగంధిక ప్రసవాపహరణము


పాండవులు బదరికావనమున నివసించుట


పరువడి వసియించు పాండునందనులు
ధరణీసురులతోడఁ దమవారితోడఁ
దగినవేళలను గృతస్నాను లగుచు
సగణితం బగుపురాణాదులు వినుచుఁ
జెనఁటి యాకురురాజు చేసినకొదువ
లనయంబుఁ దలఁచుచు నావనంబునను
ధూర్తదానవకోట్ల ద్రుంచివైచుచును
నార్తులఁ బ్రోచుచు నలరుచుండఁగను

 

వసంత కాల వర్ణనముబొలుపొంద తీయనిపూవుఁ దేనియల
వలసి వల్లములుగా వలగొని త్రావి
మధుమత్తవిస్ఫూర్తి మలయుచు మెలఁగు
మధుపసంఘంబులు మధురగానముల *
జతలుగూడి యపాంగసంగతు ల్నెరపి
సతతంబు క్రీడించుచారణాంగనలు

*మధుర ప్రసంగముల్ మధురవాక్యములు (త)