పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము


సకలపురాణశాస్త్రంబులు వినుచు
నకలంకహృదయుఁడై నలరుచు నుండి
జనమేజయుండు వైశంపాయనునకు
వినయమార్గంబుల వినుతులు చేసి
విహితభక్తిజ్ఞానవిభవవైరాగ్య
మహితతపోధనమౌనికులేంద్ర!
పాండవులకు యక్షపతికి నేతెరఁగు
భండనంబు ఘటిల్లె? ప్రదన మేరీతి?
అలర జయాపజయంబు లెవ్వరికిఁ
గలిగె నానతియిమ్ము కరుణాపయోధి
యని విన్నవించిన యతికులేంద్రుండు
మనుజేంద్రుఁ జూచి సమ్మతి నిట్లు పలికె.