పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

సౌగంధిక ప్రసవాపహరణము

ధరణి భాగీరథీతరలాక్షిఁ బోలి
పరఁగు శ్రీలక్కమాంబాగర్భమునను[1]
గన్న సద్గుణధామకాంతాలలామ
సన్నుతాంగ విలాసచంద్రికాహారి
పరమకళ్యాణసంపత్పరంపరల
నరవిందమందిర యనఁగఁ జెన్నొంది
రచితశుభాకరరమ్య వైఖరుల
నచలేంద్రకన్యక యన నొప్పు మీరి
ప్రతిలేనిరూపవిభ్రమవిలాసముల
రతిదేవి యనఁగ ధరాస్థలి వెలసి
పరఁగు శ్రీభాష్కరాంబాపయోజాక్షి
వరముహుర్తమున వివాహమై ప్రేమ

లింగభూపతిభార్య భాస్కరాంబ


లొనర భావింపుచు నుచితవైఖరుల
వినుతకీర్తుల ధాత్రి వెలయుచునుండె.
మదదానవారిపదావతియందు

  1. పరఁగు శ్రీరంగమంబాగర్భమునను (క)