పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

సౌగంధిక ప్రసవాపహరణము

నళుకు బెళుకును లేక నని సేయువేళ
వేయారు లెద గాడి వీఁపున వెడలు
గాయముల్ మణిపతకంబులు గాగ
వెక్కసంబున మేన విరిగినయలుఁగు
లక్కజంబుగ హీరహారముల్ గాఁగ 535
పెనగొని మైవ్రేలు ప్రేవులసొబగు
తనరు నుత్తరజన్నిదంబులు గాఁగ
తరలక రంభాదితరుణులు మోహ
భరితలై తనదిక్కు భావించి చూడ
ఆచంద్రతారార్క మగునట్టికీర్తి 540
భూచక్రమున నించి పోరిలో వెలసె
ఆమహావీరుని నాత్మజులందు[1]

కొండభూపాలుని సంతానము


రామాభిరాముఁడు రణభయంకరుఁడు
వితరణకర్ణుఁడు విద్యలభోజుఁ
డతిబలశాలి దయాపయోజలధి 545

  1. ఆమన్నెహమ్మీరు నాత్మజులందు (క)