పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

సౌగంధిక ప్రసవాపహరణము

మంతుకెక్కిన మేటిమన్నీలతోడ
పంతము ల్గలధరాపాలురతోడ
బలువిడి చతురంగబలములతోడ 500

కొండభూపాలుని పరాక్రమము


వలనొప్పు పలువైభవములతోడ
ఖకకరదీప్తులకరవాలుఁ బూని
సరిలేని చికిలిపచ్చలబాకు గట్టి
కరకుకెంపులబాషికంబులు దాల్చి
తరలక కరనీరదామంబుఁ బూని 505
సిరిగుల్కు రత్నాలసింహతలాట
బిరుదాంకముల చాల పెంపొందు జవన
తురగంబుపై నెక్కి తోరంపువేడ్క
సరసల వీరసేనలు జల్లుచుండఁ
గొప్పయెఱ్ఱనిపట్టుగొడుగులనీడ 510
నొప్పు చల్లనిగాలి యొదవుచు నుండ [1]
చెలువొంద జయలక్ష్మి చేకొనుకొఱకు

  1. వొప్పుచందురు కావి యుల్లెడక్రింద (క)