పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

31

జలనిధి సంపూర్ణచంద్రునిలీలఁ
గలిగె శ్రీకొండ భూకాంతశేఖరుఁడు
ఆకొండనృపతి దయాపరమూర్తి
శ్రీకామినీనాథ సేవాభిరతుఁడు
అనిలోన నెదిరిన మహితకోటులకు
ఘనదివ్యభోగము ల్గలుగంగఁ జేసి
వెన్నుచ్చి చను శత్రువిభులకు నెల్ల
సన్నుతం బైనమోక్షంబుఁ గల్పించి
శరణుజొచ్చిన రిపుజనకోటి నెల్ల
నురుభోగభాగ్యసంయుతులఁ గావించి
తనకీర్తి యాచంద్రతారకముగను
వినుతింప నెగడించి వెలయ భూస్థలిని
రాజతేజుం డగు రావిళ్లలింగ
భూజానికొండభూభుజుఁడు మోదమున
సులవకపుత్త్రుల సుముహూర్తమునను [1]
జెలగుచు రాజ్యాభిషిక్తులఁ జేసి

  1. సొలవక పుత్త్రుల సుముహూర్తమునను (క)