పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

సౌగంధిక ప్రసవాపహరణము

బలియుఁ డాకొండభూపాలసోదరుఁడు

కొండభూపాలుని సోదరుఁడు అయ్యపనాయకుని ప్రభావము


విలసితసాహసవిక్రమార్కుండు
గురుతరపరవీరకోలాహలుండు
వరభవ్యగాంగేయవర్ణకేతనుఁడు
రాజిల్లు వెలియు కర్ణాట శ్రీరామ
రాజదత్తకిరీటరమ్యభూషణుఁడు
మనసిజాకృతి చెంచుమలచూరకార[1]
ఘనబిరుదాంకుండు కలితతేజుండు
నరనుతు నయ్యపనాయకేంద్రుండు
ధరణీశు లెన్న భూస్థలి వార్త కెక్కె
ఆమోద మెసఁగ నయ్యపనాయకేంద్రు

అతనికుటుంబము


భామిని వెంగమాంబామణి గర్భ

  1. వరుస నార్గురు చక్రవర్తులకరణి
    నిరవొంద ధాత్రిని నేలుచునుండె (క)