పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

29

సంగరాటోపప్రచండాధిరాజ
పుంగవప్రాభవభుజగర్వహరణుఁ
గరుణాపయోనిధి గాయగోవాళ
బిరుదాంకుఁ డగులింగపృథ్వీతలేంద్రు 465

లింగభూపతి


గద్దరి రిపువీరగజసింహమూర్తి

ముద్దులనాయఁడు


ముద్దులనాయని మోహనాకారు
నిటువంటితనయుల నిరవొందఁ గాంచి
పటుసత్యశీలుడై ప్రబలుచు నుండె[1]

  1. శంకర నిశ్శంకశౌర్యహంవీర
    కంకణహస్తసంగడిరక్షపాల
    శత్రుమహీనాథ సముదయాకార
    చిత్రతాందగభీమసింహతలాట
    నరకొర్యముఖ్య నానాభవ్యబిరుద
    భరితుఁడు కొండభూపాలశేఖరుఁడు
    తనకీర్తి భూనభోంతరములు నించి
    ఘనులు భూజనులు సత్కవులు నుతింప