పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

సౌగంధిక ప్రసవాపహరణము

బుత్రులుగాఁ గాంచి పొలుపు వహించి
ధాత్రీపతులు మెచ్చ ధరణిపై వెలసె
ఆకుమారులలోన నహితరాజన్య

కొండభూపాలుని సంతానము.


భీకరశౌర్యుండు భీమబలుండు
బలభేదివిభవుండు బటుబెళగంటి
జలరాశి టంకశుంభత్ప్రౌఢిరాజ[1]
పురహల్లకల్లోల భువనభేతాళ
పరసైన్యభైరవ బల్లాడరాయ
గండోగ్రజగనొబ్బ గండప్రచండ
గండరగండవిఖ్యాతకేళాది
రాయచౌరాసీ దుర్గవిభాళచటుల
గాయగోవాళరక్తచ్ఛత్ర బసువ
శంకర సర్వేశ నిశ్శంకసాహసుని

వెంకభూపతి


వెంకభూపాలుని విమలచారిత్ర

  1. బలశిలాటంకశుంభత్పాండ్యరాజ్య. (క)