పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

సౌగంధిక ప్రసవాపహరణము

బరగిన పెద్దమాంబాగర్భమునను 385
హరిహరసదృశులై యలరినసుతుల

తిప్పభూపతికుమారులు అయ్యపనాయఁడువెంకటాద్రి.


నిరువురఁ గాంచె మహేశసన్నుతులు
బలశౌర్యధనునయ్య పక్ష్మాతలేంద్రు
నలఘుతేజుని వేంకటాద్రిభూవిభుని
నరయ నాయిరువురయం దగ్రజుండు 390
పరమపావనుఁడయ్య పక్ష్మాతలేంద్రుఁ

అయ్యపనాయనిభార్య లక్కమాంబ కుమారుఁడు తిప్పభూపతి.


డతిశీలవతి లక్కమాంబికయందు
సుతుని శ్రీతిప్పవసుంధరాధిపునిఁ
గని పెంచి సకలభూకాంతులు గొలువ
పనుపడ తనయుని పట్టంబుగట్టి 395
క్షితి నెంత వారికి చెల్లని బిరుదు
లతిశయింబుగఁ దాల్చి యలరఁ బట్టించి
హగలు గగ్గోలురాయ హజీరుఁ డనుచు.[1]

  1. హగలు గగ్గోలురాయ వజీరుఁ డనుచు (క)