పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

సౌగంధిక ప్రసవాపహరణము




రణవీరఘంటానిరాతంకమల్ల[1]
ప్రణుతసింహతరాట పరబలభీమ
నిత్యాభిరామ నిర్నిద్రప్రతాప
సత్యహరిశ్చంద్ర సంగడిరక్ష .
పాలకగాయగోవాళహంవీర[2]
కేళాదిరాయ సత్కీర్తికలాప
చలమర్తి వరగండ జగనొబ్బగండ
కలితాదవనిదుర్గగర్వవిభాళ
హత్తుమువ్వరగండ హర్యక్షశౌర్య
మత్తారి మదభంగ మదనావతార
కనక వసంతాంక గగ్గోలురాయ[3]
ఘనతరప్రజ మెచ్చు గండారిఘోర
బిరుదాంకుపేర గంభీరాబ్ధిపేర[4]

  1. రణవీరఘంటానిరాటంకమల్ల (త)
  2. a. పాలక రాజగోపాల హంవీర (ట)
       b. పాయక గాయగోపాల హంవీర (త)
  3. కనక వసంతాఖ్య గగ్గోలురాయ (త )
  4. బిరుదాంకుపేర గంభీరుని పేర (డ)