పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

454

సౌగంధిక ప్రసవాపహరణము



నలరుచు నున్న ధౌమ్యాదులతోడ
పోడిమి నావనభూమి కొన్నాళ్లు
వేడుకల్ మీరంగ విహరింపుచుండి
కడుద్వాదశాబ్దము ల్గడచిసపిదప
తడయక ననుజులు ద్రౌపది తాను

వెలయంగ నొకయేడు విరటునియొద్ద
కొలువుండి తర్వాత గురుతులు తెలిపి
యలరుచు నుత్తర కభిమన్యునకును
జెలగి వివాహంబు చేయించి వేగ
నిరటుండు ద్రుపదభూవిభుఁ డాదియైన

నరవరులరు దేర నలినలోచనుఁడు
ఘనతసహాయుఁడై గరిమతో నడువ
జని కురురాజుపై చల మగ్గలించి
మునుకొని సుముహూర్తమున సేనతోడ
మొనసి కురుక్షేత్రమున దండు విడిపి

పెలుసంగరమున భీష్ముఁ జెండాడి
నలవడ కలనిలో నాచార్యుఁ దునిమి