పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

453



బరఁగ దీవించి ద్రౌపది నాదరించి
సరసోక్తులను నుపచారముల్ చేసి
యెలమి ఘటోత్కచు నెసగ లాలించి
యలరి వారలనుతు లంగీకరించి
యదువాహినులతోడ సజ్జలోచనుఁడు 1930
పొదలుచు ద్వారకాపురమున కరిగె;

ఘటోత్కచుఁడు వెడలుట

ఎలమితోజనకుల కెల్లను మ్రొక్కి
పొలుపొంద బాంచాలపుత్త్రికి మ్రొక్కి
రాజిల్లు మౌనివిప్రకులంబునకును
దేజంబుతో మ్రొక్కి దీవనలంది1935
జనకుల యనుమతి సైన్యంబుతోడఁ
దన నివాసముఁజేరె దా నవేశ్వరుఁడు

తర్వాతి భారతకధ

ధరమహొన్నతులైన తమ్ములతోడ
పరమసాధ్వీమణి పాంచాలితోడ
వలనొప్ప బాంధవవర్గంటుతోడ1940