పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

452

సౌగంధిక ప్రసవాపహరణము



నలువంద పాండునందనుల దీవించి
పొలుపొంద పాంచాలపుత్త్రి దీవించి
చెలువంబుతో సర్వ సేనల గూడి
యలకాపురంబున కరిగె శ్రీదుండు
ప్రేమతో ధర్మజభీమార్జునులను
వేమరు కృప గారవించి దీవించి
యదువంశభూషణుం డనుప నత్యంత

శివుఁడు కైలాసమునకుఁబోవుట

ముదమున గైలాసమున కేఁగె హరుఁడు

దుర్యోధనుఁడు కరిపురంబునకుఁబోవుట

తలఁప ధర్మజునకు దండంబుపెట్టి
వలనొప్ప శౌరికి వలనొప్ప మ్రొక్కి
యరుదార సకలసైన్యసమేతుఁ డగుచుఁ
గరిపురంబునకును గదలె రారాజు,

కృష్ణుఁడు ద్వారక కేఁగుట

ధర్మ సూనునకు వందన మాచరించి
యర్మిలి భీమార్జునాదుల నెల్ల