పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

451


నృపచంద్ర నినుఁ జూచి నేర్చుకోగలరె
నిజబల్మి యున్నది నీరజాక్షుండు
విజయనీకాప్తుడై వెలయుచు నుండ
యాలంబులోన బాహశక్తిఁ జూప1900
నీలోకములను నీకెదు రెవరయ్య
యనుచు మెచ్చుచు బునరాలింగనంబు
లొనరించి తగువేడ్క సున్నంతలోన;

బ్రహ్మసత్యలోకమునకుఁ బోవుట

ఆవేళ పద్మజుం డధికమోదమున
భావజజనకుని బార్వతీధవుని1905
కడకతో సన్నుతు ల్గావించి మ్రొక్కి
తడయక పాండునందనుల దీవించి
యరుదైన హంసవాహనముపై నెక్కి
కరమర్ధి సత్యలోకంబున కరిగె

కుబేరుఁ డలకాపురమునకుఁ బోవుట

శంకరునకు నమస్కారంబుఁ జేసి1910
పంకజాక్షున కట ప్రణమిల్లి పొగడి