పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

445



దైవంబు భృత్యంబు దాతయై మెలఁగ;[1]
నీవు చేసినపుణ్య మెన్న శక్యంబె!
నీశాంతగరిమంబు నీసత్యమహిమ
నీశౌర్యవిస్ఫూర్తి నీధర్మ గుణము
నెరయ నీతాలిమి నీ నేర్పునోర్పు
వరుసనార్గురుచక్రవర్తులం దైన
నమర చూడము విన్న యదిలేదురాజ !
మెచ్చె కృష్ణుఁడు నిన్ను మెచ్చితి నేను
యిచ్చకువచ్చిన యేవరంబైన
నడుగు మిచ్చెద నన హరునకు మ్రొక్కి
తడయక నాధర్తతనయుఁ డి ట్లనియె;

ధర్మజువరము

పార్వతీవల్లభ భవరోగవైద్య
శర్వ మహాదేవ శంకర భర్గ
భూతనాయక ఫణిభూషణ సర్వ
భూతదయాపర భువనప్రతాప
జలజనాభుఁడు మీరు సద్వినోదములఁ
 

  1. దైవంబు భృత్యుండు దాతయై మెలఁగ (ట; త)