పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

444

సౌగంధిక ప్రసవాపహరణము



వినయమార్గంబుల వేర్వేర మ్రొక్కి
వినుతులు గావించి వెస నిల్చుటయును;
వేడుక మువ్వుడు వీరశేఖరుల
పోడిమి దీవించి పొసగ లాలించి
గారవంబున వారికలక వారించి
గారాపు వియ్యంబు గల్పించి చెలఁగి
హరుఁడు ధర్మజువదవాబ్జంబుఁ జూచి
కరుణారసము చిల్కఁగా నిట్టు లనియె
పాండవాగ్రణి నీద భాగ్యంబు ధరణి[1]
మండలాధిపతుల కీమహిమలుగలవె !
తనయులు చండప్రతాపవిక్రములు
ననుజులజేయు లగణ్యసాహసులు
నలఘు ధీరోదారు లరిభయంకరులు
బలశౌర్యవిభవులు బాంధవాశ్రితులు
వెలయంగ హయ్యంగవీనాపహరుఁడు
చెలికాఁడు చుట్టంబు చేరిక మరఁది

  1. పాండవాగ్రణి నీవు భరితపుణ్యుఁడవు (త)