పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

442

సౌగంధిక ప్రసవాపహరణము



మీకేమి పనిలేదు మిగిలినయట్టి
లోకముల్ హల్లకల్లోలములో గావె,
కోపము ల్వారించి కూర్మి పాటించి
చేపట్టి మమ్ము రక్షింపఁగావలయు,
నని దైన్యరసమున నడలుచుఁ బలుకు
వనజాసనుని గాంచి వరదయానిధులు

యుద్ధము మానుట

తగవిచారించి మాత్సర్యముల్ డించి
యొగి మహాయుధముల నుపసంహరించి
గజరాజవరడుండు గజచర్మధరుఁడు
గజిబిజి చాలించి ఘనత నేతెంచి
యెలతోడ విరించి యెడదయ లుంచి
యలుకు వారించి చయ్యన గారవించి
యిరువురు నొకపరి యిరవందఁ జేరి
కరము రంజిల్ల గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి
యొకటియై మువ్వురు నుండి యాలోన
మకరాంకవైరితో మాధవుం డనియె