పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

440

సౌగంధిక ప్రసవాపహరణము


నెక్కి యక్కజముగా నిలకు నేతెంచి1720
మచ్చరంబున నున్న మాధవహరుల
విచ్చలవిడి మది వెరగంది చూచి
యిరుపురనడుమ దా నెంతయు దుమికి
శరణంబు శరణంబు శరణం బటంచు
నటు మళ్లి యిటు మళ్ళీ యటు నిటు మరలి 1725
పటుభయభక్తితోఁ బ్రణమిల్లి లేచి
నయమొందఁగా హస్తనలినము ల్మొగిచి
జయజయ కమలాక శరశిలాటాంక [1]
జయజయ సితగాత్ర సత్యచారిత్ర
జయజయ గోరాజ సన్నుతతేజ 1730
జయ దైత్యశిక్షపుష్కరహితాబ్జాక్ష
జయజయ గోత్రాత్మజామనోరమణ
జయరాజశేఖర సల్లలితోదార
జయజయ వరఖగజానేయజనక[2]

  1. a. జయజయకమలాంక శశిలలాటాంక (త)
    b. జయజయకమలాంకశరశిలాటంక.
  2. జయజయ భర్గ గజాననజనక (త )