ఈ పుట ఆమోదించబడ్డది
పీఠిక
భూమండలాధ్యక్షుఁ బుండరీకాక్షు
"రాముని సుగుణాభిరాముని మదిని
భావించి చూచి సంభ్రమమునఁ బొదలు
పావనగుణధామ భామాలలామ
నీతామహాదేవి చెలువంపుఠీవి
ఖ్యాతిగా సకలసౌఖ్యములు సంపదలు
రాజిల్లు సిరు లిచ్చి రావిళ్ల లింగ
భూజాని ననయంబు బోషించుఁగాత
చక్కెర కవణంబు చవిగొని మెక్కు
జక్కి నెక్కినజోదు సమయించు వేల్పు
పలిగట్టుపట్టికి వలపులు గులుక
నెలమి దేహం బర్థ మిచ్చినదాత
పావిబువ్వకు బుట్టు బలియు సోదరుని
చేపట్టి గోర్కె లిచ్చినదయాజలధి
సొలపు చీఁకటిగుంపు సొంపుల బెంపు
చలివేఁడి వెలుగుల జరుగుచక్రములు
దుక్కి కైదువబూను దొర బిడ్డ తమ్ముఁ
డక్కుననేర్చిన యబల పెద్దన్నఁ