పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

438

సౌగంధిక ప్రసవాపహరణము




విలయావసరమధ్య వేలాతివేల
చలిత చరాచర జగదంతరాళ
తంతప్యదుష్ణసంధాన సహస్ర[1]
కాంతిచ్ఛటాంశుప్రకాండప్రచండ
సముదయద్వాదశసంఖ్యావిధాన1695

తిమిరహరాదిత్య దేదీప్యమాన
దశశతపారారథారానుసార[2]
నిశితరథాంగంబు నీటుతోఁ బూని
నలువందపాంచజన్యంబుఁ బూరించి
సొలవక, హరునిపైఁ జూడ్కి నిల్పుటయు; 1700

ఆచక్రవాళపర్యంతవిశ్వంభ
రాచక్రమంతదుర్వారవేగమున
వరుస కుమ్మరసారెవై ఖరి నొరసి[3]

  1. తంతప్తమానసంధాన సహస్ర (త)
  2. a . దశశతసారసంధానానుసార (ట)
    b. దశశతసారాంధధారానుసార (త)
  3. వరుసకుమ్మరసారెవైఖరి దిరిగె (త)