పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

430

సౌగంధిక ప్రసవాపహరణము




నహికెక్కు నేరయోధవర్యులతోడ
రహిమించు బంధువర్గంబులతోడ
మేరుధీరులు నగు మిత్రులతోడ
భూరిబలాఢ్యులౌ పుత్త్రులతోడ
బిరుదులు పోనాడి భీమనందనుఁడు
గురుతైవరణభూమిఁ దోలె నంతయును
గనుఁగొని కనలి పంకజలోచనుండు
కనులెఱ్ఱచేసి శంఖంబుఁ బూరించి.

ఘటోత్కచుఁడు మూర్చిలుట

బిరుదారిసందోహభీముని భీము
సరసతేజోధనంజయు ధనంజయుని
ప్రాకట బలజగత్ప్రాణుని ద్రోణు
భీకరారాతి విభీష్ముని భీష్ము
తరలని యభిమానధను సుయోధనుని
ధరనగణ్యేభ సైంధవు సైంధవుని[1]

  1. a. ధరనగణ్యభప సైంధవు సైంధవుని (ట)
    b. ధరనగణ్య భజనధవుని సైంధవుని (ట)