పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

424

సౌగంధిక ప్రసవాపహరణము


డతిబలవిక్రముఁడై మఖమంతుఁ
డాదిగాఁ గలుగు మహాయోధవరులు
మేదురంబుగఁ బన్ని మిన్ను గ్రక్కదల[1]1460
బెట్టార్చుచును నొక పెట్టున నేఁగి
కట్టల్క గగపభాగం బెల్లఁ గప్ప
ననలానిలాదిదివ్యాస్త్రజాలముల
ఘనతపింజాపింజఁ గదియనేయుటయు;
ఆవిధమంతయు నరుదార నపుడు1465

అభిమన్యుఁడు యుద్ధము నందు మూర్ఛిలుట

భావించి గాంచి సౌభద్రుండు గెరలి .
జగములు పదునాల్గు జలదరింపఁగను
గగనంబు నగుల శంఖంబుఁ బూరించి
దారుణసింహనాదంబుఁ బర్వించి
ధీరత వా రేయుదివ్యబాణముల1470
నన్నింటిఁ బొడిచేసి యరదంబు నూకి
యెన్నఁగా భృంగీశు నేడంబకముల

  1. మేదురంబుగ ధాత్రి మిన్నుగ్రక్కదల (ట).