పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

423



సలలితరథచక్రచయముల క్రింద
నళుకుచుఁ జొరబారి రథికయోధలును
బెదరుచుఁ బీనుంగు పెంటలలోన
నొదుగుచు డాగిరి యొగి వీరభటులు 1445

ఘటోత్కచుడు శివునితో యుద్ధంబు సేయుట

అంతట బోక నయ్యసురవల్లభుఁడు
కంతువిద్వేషిపై గమకించుటయును;
కనలి శంభుఁడు పినాకం బెక్కు పెట్టి
వనధు లింకఁగ గుణధ్వనిచేయుటయును;
ఘనరోషచిత్తుఁడై గణనాయకుండు 1450
వినుతప్రతాపుఁడై వీరభద్రుండు
ప్రళయాంతకునిలీల బాహులేయుండు
ఇలమహోద్దండుఁడై భృంగీశ్వరుండు
జగదేకవీరుఁడై చండీశ్వరుండు
నగణితాటోఫుఁడై యర్థనాయకుఁడు 1455
నగభిత్ప్రతాపుఁడై నందికేశ్వరుఁడు
నతులరణాద్యుక్తుఁడై మణీగ్రీవుఁ