పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418

సౌగంధిక ప్రసవాపహరణము


భావించి కర్ణునిపాటెల్లఁ జూచి
భావజజనకుండు పాంచజన్యంబు
పూరించి రథికులఁ బురికొల్పుటయును
ధారుణి వణఁక నుద్దండవేగమున1355
జని బలప్రద్యుమ్న సాత్యకి ముఖ్య
ఘనయోధవర్యు లొక్కటఁ జుట్టికొనినఁ
గాంచి భృంగీశ్వరగణనాయకులను
క్రౌంచభేదనముఖ్యరథికశేఖరుల
ప్రధనజయాకాంక్షప్రౌఢి నేతెంచి1360
పృథ్వి భేదిల నార్చి బెట్టు దాఁకుటయు;
నడరి కోపించి తాలాంశుఁ డవ్వేళ
తొడిఁబడి గణనాథుఁ దొడరి పోరాడె
భద్రవిక్రమకళాప్రౌఢిచే వీర
భద్రునిఁ దాఁకి సౌభద్రుండు పోరె
సాత్యకి చెలరేఁగి షణ్ముఖుతోడ
నత్యంతబలశక్తినని సల్ప నపుడు;
నందికేశ్వరుమీఁద నడిచెఁ బుష్కరుఁడు
కందర్పరిపుఁ దాఁకె కమలలోచనుఁడు