పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

417



రౌద్రుఁడై కర్ణుండు రహి నార్చి వీర
భద్రునియరదంబు పడగయు విల్లు
తురగసారథులతోఁ దునియలుసేసి
గరకరి మేనెల్లఁ గాడ వేయుటయు[1]
పరువడి యవ్వీరభద్రుండు గెరలి 1340

మరలు భేదిల్ల శేషుఁడు తల్లడిల్ల
పటపట బ్రహ్మాండభాండము ల్బగుల
ఘుటఘుటధ్వనిచేసికో యని యార్చి
కరవాలమును బల్కఁ గైకొని రోష
భరితుఁడై భానుసంభపు నిరీక్షించి1345

తలవాంచి ఖడ్గంబు తళతళ మనఁగ
ఝళిపించి రథముపై చంగున దుమికి
కుప్పరం బెగసి దిక్కులు నిరీక్షించి
యుప్పొంగి యదువీరయోధుల దరిమి
సముదగ్రరథరథ్యచయములతోడ 1350
కమలాప్తనందను ఖండించుటయును;

  1. కరకరి మేనెల్ల గదియ నేయుటయు, (ట)