పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

416

సౌగంధిక ప్రసవాపహరణము


నలువందఁ జండీశు నాల్గింట నేసి
యలరుచు భృంగీశు నైదింట గ్రుచ్చి
తక్కినరథికులదర్పంబు లణచి1320
యెక్కువ బలముల నెల్ల భేదించి
బారులు చీకాకుపడ చెండివైచి
తేరులు కూల్చి గద్దించి డీ యనుచు
కరుల నేలణఁగించి ఘనుల బోఁ దరిమి
హరుల నీరుగఁ జేసి యార్భటల్జేసి1325
అంగజహరుని డాయంగ నేతెంచి
పొంగి వైశ్వానరభూరిసాయకము,
నరుదార గంధపుష్పాక్షత ధూప
పరమంత్ర యుతముగా వైచె; వైచుటయు
వెరగంది వీక్షించి వీరభద్రుండు1330
వరుణాంబకంబుచే వహ్ని బాణంబు
తుమురులు గావించి దోశ్శక్తి మించి
యమరులు భేదిల్ల నార్చి కోపించి
యిన నందనుని దాఁకి యిషుపరంపరల
పనుపడ గరిదూరి పారనేయుటయు;1335