పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

415



మన విని నవ్వి కంజాక్షునిమోము1300
గనుఁగొని పలికె నాకమలాప్తసుతుఁడు
మురదానవాంతక  ! మున్నె యీ యోధ
వరులెల్ల వినఁగ దుర్వారప్రతిజ్ఞఁ
బలికితి శంకరప్రముఖులౌ యోధు
లెలమి నాజోడంటి నిఁక మాట లేల?1305
శంకరుతో యోధచయములతోడ
పంకించి గెలిచిన ప్రబలు నాకీర్తి
తెగి నన్ను వారు సాధించిరే నీవు
పగ దీర్పుదువుగాని పంకజనయన
నను సంతరించిన నరవరోత్తముఁడు 1310
గనుఁగొని మెచ్చ విక్రమముఁ జూపెదను
ననుఁజూడు, ప్రమథాదినాథులఁ జూడు
మని పల్కి, సకలసైన్యదులు భేదిల్ల
విలుగుణధ్వనిచేసి, విఘ్నేశుఁ దాఁకి
యలఘుబాణంబుల నతని నొప్పించి1315
వీరభద్రుని రెంట వికలంబుసేసి
తారకారిని శరత్రయమున నొంచి