పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

399


అహిరాజకేతనుఁ డరుదెంచినాడు 1035
కురుపాండవుల జతగూడి యుండఁగను
దుర మొనరింప యింద్రునకైనఁ దరమె
పెక్కు యోచనలేల పృథ్వీతలేంద్ర
యెక్కువ పనులకు నేనున్న వాఁడ

కర్ణకృష్ణ సంవాదము

ననిన భానుతనూజుఁ డంభోజనాభుఁ 1040
గనుఁగొని రౌద్రుఁడై గద్దించి పలికె
భళిభళి! మేల్మేలు! పంకజనయన
కులశీల బలశౌర్యగుణశాలి వగుట
తెలిసె నీ కిన్నియుఁ దెలియ రెవ్వారు !
సొలవక నెంతశ్రేష్ఠుఁడ వైతి వీవు!1045
నిన్న నే దాసరి నేడె రాగంబు
నిన్నెరుంగుదు నేఁగు నీరదవర్ణ!
బండాటములుచేసి ప్రజలు దిట్టంగ
కుండలతోఁ దిని గొల్లలయిండ్ల
దొంగిలి కొంటెబుద్దులు కొన్ని నేర్చి1050