పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

395



<poem>



ఘనతరగాఢాంధకారంబు గప్పె965
భేరికాహళశంఖపృథుల డఘామి
కారావములకు బ్రహ్మాండము ల్పగుల
కరిఘటఘంటి కాకలితఘీంకార
గురుఘోషణములకు కులగిరు లురలె
పరువడి నరవీరభటసింహనాద970

హరిహేషలకును దిగంతము ల్వణఁ కె
చతురంగ వాహినీ సంయుతుఁ డగుచు
నతివేగమున వచ్చె వబ్జలోచనుఁడు
కని ధర్మజుఁడు మహాకౌతుకం బడరఁ
దన సహోదరులును దా నెదురేఁగి 975

-:హరి పాండవులకు సహాయము వచ్చుట:-



మ్రొక్క నుద్యోగించు మురవి భేదనుని
గ్రక్కున నక్కునఁ గౌఁగిటఁ జేర్చి
పొల పొంద వినుతించి పూజలుం జేసి
బలరాముఁ గని చాల ప్రణుతించి పొగడి
పలుమరు తనగూర్చు బంధువర్ధములఁ