పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

394

సౌగంధిక ప్రసవాపహరణము




 
యానుకు వేట్లాడు టది నీతి యగునె![1]
అని వారి వారించి యక్కు నఁ జేర్చి950

చనువున నొక కొన్ని సఖ్యముల్' 'నెరపి
వెస భీష్మునకుఁ చాల వినయముల్ చేసి
పొసఁగ యుద్ధమున కుప్పొంగుచున్నంత ;
నెందుఁ జూచిన నేల యీనిన లీల
పొందుగా జలధు లుప్పొంగి పెల్లుబ్బి955

పొలుప పిల్లిగ వచ్చు పోలిక దనర
బలువిడి "గెరలి నిబ్బరమున నడుచు
సకలసైన్యో ద్ధూతసాంద్ర పరాగ
నికరంబు చేఁ బయోనిధులు గలంగె
గిరిసుతవహియించే ఖేదమోదములు950

హరుఁడు మున్నగఁ దాల్చె నాత్మలో చింత
రవిచంద్రతారకారాజికీ మిగుల
సవిరళం బైన మార్గాయాస మొదవె
మొనసి యహోరాత్రములు గానఁబడక



  1. యానుక వేట్లాడు టది నీతి యగునే (త).