పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

389




శుకదామునకు నలసూతపుత్త్రునకు;
శకునికి నుతికెక్క సైంహికేయునకుఁ
జండీశ్వరునకును సహదేవునకును;
నొండొండ సరి యుద్దు లుర్వీతలేంద్ర"875

తలపోసి చూడ యోధలకు యోధలకు
లలిమీర సైన్యంబులకు బలంబులకుఁ
దొలఁగక త్రాసునఁ , దూఁచినవైన
నలర సమానంబు లదిగాక వినుము
వారిలోపలను మనవారిలోపలను880

వారక రహికెక్క వరయోధులందుఁ
జటుల సాహసశక్తి సరిపోల్ప రాని
పటుబలాఢ్యుఁడు హిడింబానందనుండు[1]
పొంకించి నన్ను నేఁ బొగడుకోరాదు
శంకరుతోఁ జేరి సరిపోరఁగలను 885
అన విని గాంగేయు నదరంటఁ జూచి

  1. సాటి యీడును జోడు గరిలేనియట్టి
    నేటివీరుఁడు హిడింబీ నందనుండు (త)