పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

386

సౌగంధిక ప్రసవాపహరణము




గురు తరతురగోగ్రఖురఘట్టనములు825
కరిపాదఘాతఘీంకారరావములు
రమణీయమణిమయరథచక్రగతులు
పుడమిఁ గంపింప త్రిభువనము ల్గలఁగఁ
దడఁబడి శేషునితల లన్ని చెదర
బెగడి కూర్మమువెన్ను బిట్టులు వార[1]830

పరమేశ్వరుఁడు కుబేరునిదగ్గఱకు వచ్చుట

తగుసప్తకులపర్వతము లొడ్డగిల్ల
నతిరభసంబున నరుదెంచి యక్ష
పతి చెంత నిల్చె నప్పరమేశ్వరుండు
నిలిచిన గనుఁగొని నెయ్యంబుతోడఁ
దులకించు తమకముల్ తొడి బొమ్మలాడఁ 835
గయ్యంబు నిల్పి యక్షకులాధినాథుఁ
డయ్యెడ హిమగిరిజాధీశుఁ జేరి
ఘనభక్తి ప్రణమిల్లి కరములు మొగిచి
వినయసంభ్రమముల వినుతించుటయును

  1. బెగడి కూర్మమువెన్ను బీటలు వార (త )