పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌగంధిక ప్రసవాపహరణము



కేళికామహిమలఁ గ్రీడించుచున్న

 కృష్ణ దర్శనము

తాలాలకసోదరు తతకీర్తిహారు
నలఘునీరదదేహు నాజానుబాహు
కలిత త్రిదశగేయు కనకకౌశేయు
లీలావిలాసు లాలితదరహాసు
బాలికామదసగోపాలునిచెంత
నిలిచిన గనుఁగొని నెలతలుఁ దాను
బొలుపొంద బ్రణమిల్లి పూజలు సేసి
యురురత్నపీఠిపై నుంచినఁ జెలఁగి
సురమౌని వసుదేవసుతుని కి ట్లనియె

నారదకృష్ణ సంవాదము

ఓ పాపనచరిత్ర! యోపాండుమిత్ర!
యోపుండరీకాక్ష! యోజగద్రక్ష!
కడకతో నొకవార్త గలదు దెల్పెదను;
కడుసావధానంబుగా వినవలయు
పరగ ధనాధీశ పాండవేయులకుఁ